Sunday, January 19, 2025

ప్రభుత్వ పాఠశాలలో చేరితే రూ. 5వేలు నజరానా

- Advertisement -
- Advertisement -

Admission take in government school and get Rs 5 thousand

మేడ్చల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెంచేందుకు మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామంలో ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి రూ. 5వేలు ఇస్తామంటూ సర్పంచి ఆకిటి మహేందర్ రెడ్డి, ఉపసర్పంచి ఆంజనేయులు నిర్ణయించారు. దీంతో పాటు ప్రతి విద్యార్థికి ఉచితంగా రెండు జతల యూనిఫామ్ లు, బూట్లు, సాక్సులు, బస్ పాస్ అందిస్తామని తెలిపారు. పై వివరాలతో కూడిన ఫ్లెక్సీని పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News