Thursday, January 23, 2025

బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల (చెవిటి)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, మలక్‌పేట లో ఈ పాఠశాలను నిర్వహించబడుతోంది. ఇందులో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అడ్మీషన్లు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

అడ్మీషన్లు పొందగోరే వారు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు పొందవచ్చన్నారు. అడ్మీషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతి సదుపాయాలు కల్పించబడుతాయి. ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ప్రవేశాలకు ఫోన్ 944036296, 9000957214 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News