- Advertisement -
పెద్దపల్లి: మండలంలోని వడ్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటిలో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అభివృద్ధిని చూసి పలువురు చేరుతున్నారని, మళ్లీ సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టనున్నారని జోస్యం చెప్పారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ రాగుల నర్సింగం, ఎండి అన్నుమియా, గుర్రం సంపత్ గౌడ్, కటికిరెడ్డి మొండయ్య, అబ్బెంగుల రాజయ్య, కొరేపు ఓదెలు, మహంకాళి మొండయ్య, బీమోజు రామాంజనేయులు, కన్నం లచ్చయ్య, శనిగారపు లచ్చయ్యలకు ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -