- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మలక్‌పేట ఆస్మాన్‌గడ్ ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు మీడియంలలో అడ్మీషన్లు జరుగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఉయదం 11 గం.ల నుండి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలలో దరఖాస్తులు పొందవచ్చని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఉచిత విద్య, వృత్తి విద్య, కంప్యూటర్ శిక్షణతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. ప్రభుత్వం అందించే ఇతర సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. వివరాలకు ఫోన్ 9000597107, 7674933347 నెంబర్లకు సంప్రదించవచ్చన్నారు.
- Advertisement -