Thursday, January 23, 2025

వికారాబాద్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 Admissions in Vikarabad Medical College

వికారాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి వికారాబాద్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరుగుతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. పరిగిలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయన్నా ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయాలు ప్రారంభిస్తున్నామన్నారు. 300 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలన్నారు. దేశంలో జిల్లాకు మెడికల్ కాలేజీ సాధించిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు. వికారాబాద్‌లో 50 పడకల ఆయుష్ దవాఖానను నిర్మిస్తున్నామన్నారు.

పరిగిలో స్థానిక ఎమ్మెల్యే అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలను హరీష్ రావు పంపిణీ చేశారు. 9200 గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ ఈ నెలలో ఉంటుందన్నారు. అందరూ అన్ని పోస్టులకు పరీక్ష రాసేందుకు వీలుగా ఒక దాని తర్వాత మరొక నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారని, పట్టు బట్టి, ఢిల్లీ పోయి ఒప్పించారన్నారు. 33 శాతం పోలీసు ఉద్యోగాలు మహిళలకు కల్పించామని, ముఖ్యమంత్రి కెసిఆర్ మొన్న సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని హరీష్ రావు సూచించారు. లక్ష్యం సిద్ధించాలంటే, చిత్తశుద్దితో పని చేయాలని, బాగా చదవించాలని, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, వారి ఆశలు నిలబెట్టాలన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News