Wednesday, January 22, 2025

పిజి వైద్య విద్య ప్రవేశాలు

- Advertisement -
- Advertisement -
నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్

హైదరాబాద్: రాష్ట్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. పిజి వైద్య సీట్ల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజి ఆ రోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫి కేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ ప రిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫి కేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షా నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవ చ్చు. సోమవారం  ఉదయం 10 గం. నుంచి 17. 5 గం.వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పా టు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్  చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికె ట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంత రం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తా రు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News