Monday, January 20, 2025

తెలుగు పతాకం ఏమిటి: జగన్‌పై అద్నాన్ సామి విమర్శలు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియచేయడంపై సంగీత దర్శకుడు, గాయకుడు అద్నాన్ సామి విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ బుధవారం ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియచేస్తూ తెలుగు పతాకం రెపరెపలాడుతోందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నటులు తారక్, రామ్‌చరణ్, మొత్తం చిత్ర బృందానికి అభినందనలు తెలియచేస్తున్నానని, మిమల్ని చూసి గర్వపడుతున్నామంటూ ట్వీట్ చేశారు.

దీనిపై అద్నాన్ సామి స్పందిస్తూ&తెలుగు పతాకం ఏమిటి? భారత పతాకం అని మీ ఉద్దేశమా? మనం మొదటగా భారతీయులం..దయచేసి దేశం నుంచి వేరుగా మిమల్ని మీరు భావించడం ఆపండి..ముఖ్యంగా అంతర్జాతీయంగా మనం ఒకే దేశం..ఈ వేర్పాటు ధోరణి 1947లో మనం చూసినట్లు ఆరోగ్యకరమైనది ఎంతమాత్రం కాదు..ధన్యవాదాలు..జై హింద్ అంటూ ట్వీట్ చేశారు. అద్నాన్ సామి స్పందనపై సోషల్ మీడియాలో అనుకూల వ్యతిరేక వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అద్నాన్ సామిని కొందరు సమర్థించగా మరికొందరు విమర్శించారు. ఇందులో వేర్పాలువాద ధోరణి ఏముందని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తులను చూసి గర్వపడితే అందులో తప్పేముందని అతను ప్రశ్నించాడు. జగన్‌మోహన్ రెడ్డి ఆ రాష్ట్రానికి అధినేతని, ఇక్కడ వ్యవస్థను గురించి మీకు తెలియకపోవచ్చని అద్నాన్ సామికి అఆ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. పాకిస్తాన్ జాతీయుడైన అద్నాన్ సామి 2016లో తన పాకిస్తాన్ పౌరసత్వాన్ని వదులుకుని భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించారు. 2020లో ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News