Friday, November 22, 2024

9 లక్షల మందికి పైగా టిబి రోగుల దత్తత

- Advertisement -
- Advertisement -

Adoption of more than 9 lakh TB patients

ప్రధాని టిబి ముక్త్ భారత్‌కు అపూర్వ స్పందన

న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన చేపట్టిన ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా క్షయ వ్యాధిగ్రస్తులను వివిధ సంస్థలు, వ్యక్తులు దత్తత తీసుకున్నారు. క్షయ వ్యాధిని 2030 సంవత్సరం నాటికి అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సామాజిక సహకార కార్యక్రమం కింద చేపట్టింది. ఈ కార్యక్రమం కింద టిబి రోగులను వ్యక్తులు, ప్రజా ప్రతినిధులు, లేదా సంస్థలు దత్తత తీసుకుని వారి వైద్య ఖర్చులను భరించడం సాధ్యపడుతుంది. ఇప్పటి వరకు 12,225 మంవది వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలు, ప్రజాప్రతినిధులు తదితరులు క్షయ రోగులను దత్తత తీసుకోవడానికి తమ పేర్లను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దేశంలోని మొత్తం 13,51,550 మంది క్షయ రోగులలో 9.42 లక్షల మంది రోగులు దత్తతకు అంగీకారం తెలిపారని, ఇప్పటికే గురువారం నాటికి 9,24,089 మంది రోగుల దత్తత జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News