Wednesday, January 22, 2025

ఆ పార్టీలపై చర్యలు తీసుకోండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన విషయాలను వెల్లడించడంలో ఆయా రాజకీయ పార్టీలు విఫలమైనట్టు ఎన్నికల సంస్కరణల వేదిక అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) పేర్కొంది. ఈ విధంగా విఫలమైన పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ విషయంపై సుప్రీం కోర్టు ఇప్పటికే రాజకీయ పార్టీలను మందలించిన విషయాన్ని గుర్తు చేసింది.

2023లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా, 2022లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు 2021లో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ అస్సాం, పుదుచ్చేరి, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించడంలో విఫలమైన ఆయా పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ కోరింది. అటువంటి వారి జాబితాను ఎన్నికల సంఘం తక్షణమే సుప్రీం కోర్టుకు తెలియజేయాలని కోరింది. వాటిపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News