Monday, December 23, 2024

సిఎం జగన్ బ్యాటింగ్ అదుర్స్! (వీడియో)

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. అంతేకాదు, బ్యాటింగ్ ఎలా చేయాలో మంత్రి రోజాకు నేర్పి, ఆమె చేత బ్యాట్ పట్టించారు.

ఏపీలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరిట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటల పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించి, కాసేపు బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత మంత్రి ఆర్కే రోజాకు బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్పించారు. ఈ ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఆటల పోటీలు 47 రోజులపాటు కొనసాగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటగాళ్లకు కిట్లు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News