Sunday, January 19, 2025

కల్తీ ఆహార కుంభకోణం: కెమికల్స్‌తో అల్లం వెల్లుల్లి పేస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర శివారులోని కాటేదాన్ పారిశ్రామికవాడలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న నకిలీ ముఠాను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుళ్లిన అల్లం, వెల్లుల్లి, ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన సుమారు 500 కిలోల నకిలీ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: చంద్రబాబు బినామీల రాజధాని అమరావతి: సురేష్

లైసెన్స్ లేని పరిశ్రమ నిర్వాహకుడు చాలా సంవత్సరాలుగా ఈ కల్తీ దందా నిర్వహిస్తున్నాడు. ఉత్పత్తులను ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌తో విక్రయిస్తున్నాడు. ఉత్పత్తి ప్రక్రియలో అపరిశుభ్ర పరిస్థితులు, వ్యర్థ జలాలు, ప్రమాదకరమైన రసాయనాల వినియోగాన్ని కూడా పోలీసులు కనుగొన్నారు. ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News