Wednesday, January 22, 2025

చందానగర్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ…..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సైబరాబాద్ కమీషనరేట్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంపై ఎస్ఒటి పోలీసులు దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి గత ఐదేళ్లుగా జవహర్ కాలనీలో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాడు. బేగంబజార్ నుండి ప్రముఖ బ్రాండ్ లకు చెందిన స్టిక్కర్లు కొనుగోలు చేసి అదే ఐస్ క్రీమ్ విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ జోన్ ఎస్ఒటి పోలీసులు శ్రీదేవి థియేటర్ సమీపంలోని జవహర్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ఉన్న ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంలో సోదాలు జరిపారు. యజమాని శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని డూప్లికేట్ స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చందానగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News