Monday, December 23, 2024

భూదాన్ పోచంపల్లిలో కల్తీ పాల దందా..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాల దందా గుట్టును భువనగిరి ఎస్ఓటి పోలీసులు రట్టు చేశారు. మండలంలోని భీమనపల్లి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న కప్పల రవి అనే వ్యక్తిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 350 లీటర్ల కల్తీ పాలు,100ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కనుముకుల గ్రామంలోనూ కల్తీ పాల వ్యాపారం చేస్తున్న కుంభం రఘు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 100 లీటర్స్ కల్తీ పాలు, 200 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News