- Advertisement -
గాంధారి: కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం సృష్టించింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. 30 మందిని ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుస్తీ పోటీల సందర్భంగా గ్రామస్థులు కల్లు తాగారు. కల్లు తాగిన బాధితులకు తీవ్ర అస్వస్థత గురికావడంతో పాటు వింతగా ప్రవర్తించారు.
- Advertisement -