Thursday, January 23, 2025

మెట్‌పల్లిలో ఏరులై పారుతున్న కల్తీ కల్లు…

- Advertisement -
- Advertisement -

మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు.
కల్తీ కల్లు మత్తులో ఆనారోగ్యాలకు గురవుతున్న ప్రజలు

Adulterous toddy in Metpally

మన తెలంగాణ/మెట్‌పల్లి: మెట్‌పల్లి డివిజన్ కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయ సమీపంలోని ఒక భవనంలో ఎంతో కాలంగా ఎక్సైజ్ శాఖ అధికారుల కనుసన్నల్లో కల్తీ కల్లు( గుల్ ఫారం కల్లు) రాకెట్ దందా యథేచ్చగా నడిపిస్తు లక్షల రూపాయలు దండుకుంటున్నారు. మెట్‌పల్లి ఎక్సైజ్ సర్కిల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ప్రతి రోజు తయారు చేసిన కల్తీ కల్లును మున్సిపల్ ఆఫీస్ పక్కన అయ్యప్ప దేవాలయం సమీపంలో, జంగం కాలనీ వద్ద వ్యాన్ ద్వారా సరఫరా చేసి అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో గుల్ ఫారం కల్లు వాడకందారుల ఆరోగ్యాలు దినదినం క్షీణించి ఆసుపత్రుల పాలై, ఆర్థికంగా కుంగిపోయి చనిపోతున్నారు. కాగా లోకల్ ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు జిలా ఎస్పీ సింధు శర్మ దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా సిసిఎస్ పోలీసులు సిఐ కిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి కల్లు శాంపిళ్లను తీసుకుని గౌడ సంఘం అధ్యక్షుడితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి మెట్‌పల్లి ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించారు. అయినప్పటికిని మెట్‌పల్లి పరిధిలో గుల్ ఫారం కల్లు తయారీని, అమ్మకాలను నిరోధించి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News