మిడ్జిల్ : ఇద్దరు మైనర్లకు ప్రేమ వివాహం జరిపించిన ఘటన మిడ్జిల్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మిడ్జిల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లుకు ఈ నెల 11వ తేదీన మిడ్జిల్ మండల కేంద్రంలోని వె ంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఆ గ్రామానికి చెందిన కొందరు పెద్దలు మైనర్ బాలిక తల్లితో కలిసి ఆలయంలో వివాహం జరిపించినట్లు సమాచారం. కాగా తన కుమారిడికి 17 సంవత్సరాలే ఉన్నాయని తన కుమారుడికి ఈ పెళ్లి ఇష్టం లేదని బలవంతంగా పెళ్లి చేయొద్దని బాలుడి తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో మొరపెట్టుకున్నా కొందరు గ్రామస్తులు బాలిక తల్లి బలవంతంగా పెళ్లి జరిపించారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ మేరకు మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌లో తమ కుమారుడికి బలవంతంగా పెళ్లి జరిపించే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేయగా పోలీసులు ఆలయం వద్ద చేరుకునే లోపే మైనర్ జంటకు పెళ్లి జరిపించారని, బాలుడి తల్లి ఆరోపించింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతుండగా తమకు న్యాయం జరపాలని బాలుడి తల్లి మరోసారి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై పోలీసుల విచారణ వేగవంతం చేపట్టారు. ఈ మేరకు మైనర్ జంటను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. అదుపులోకి తీసుకున్న మైనార్టి జంటను జిల్లా బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనలో పలువురిపై కేసు నమోదు
మైనర్ ప్రేమ జంటకు వివాహం జరిపించిన ఘటనలు వివాహానికి జరిపించిన సహకరించిన వివాహంలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి వి చారణ జరుపుతున్నట్లు మిడ్జిల్ పోలీసులు తెలిపా రు. మైనర్ జంటలకు పెళ్లిళ్లు చేసిన సహకరించిన ఆ పెళ్లిలో పాల్గొన్న చట్ట ప్రకారం శిక్షార్హులవుతార ని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి పై చట్ట ప్రకారం శిక్షించబడతారని ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు.
ఫిర్యాదు చేసిన వారిపై కేసు నమోదులా?
తమ కుమారిడిని బెదిరించి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఫిర్యాదు చేయగా తమ కుమారుడిపైనే పోలీసులు కేసు పెట్టడంపై బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.