Monday, December 23, 2024

నిమజ్జనానికి విద్యుత్ శాఖ ముందస్తు ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటీబ్యూరో:  వినాయక నిమజ్జనానికి విద్యుత్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28న వినాయక నిమజ్జన కార్యక్రమం ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ విగ్రహాలకు అడ్డం వస్తాయనకుంటున్న చెట్ల కొమ్మలను తొలగించడమే కాకుండా , విగ్రహాలు వెళ్ళే మార్గంలో అడ్డం వస్తాయనుకుంటున్న విద్యుత్ తీగలు ఎత్తును పెంచడ లేదా,తగ్గించడం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ కేబుల్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా నిమజ్జన సమయంలో విద్యుత్ సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ నిమజ్జనాలు ముగిసే వరకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి సమస్యలు రాకుండా పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి నిమిజ్జన కేంద్రాల వద్ద ఎటువంటి అంతరాయాలు ఏర్పడకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు అదనంగా అందుబాటులో ఉంచుతున్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు.

భారీ గణనాథులు ప్రతిమలు నిమజ్జనానికి తరలించే సమయంలో ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా 24 గంటలు విద్యుత్ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. భారీ గణనాథుల విగ్రహాలను తరలించే రూట్లలో తీగలను సర్కిళ్ళ వారీగా అధికారులు పరిశీలిస్తున్నారు. డిస్కం డైరక్టర్లు నిమజ్జన ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. నిమజ్జనాల సందర్భంగా 5వ రోజు నుంచే విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

దుర్గం చెరువు, హస్మత్‌పేట చెరువు, అల్వాల్, సరూర్‌నగర్ చెరువు, మీరాలం, రాజన్న భావి ప్రాంతాల్లో జరిగే గణేష్ నిమజ్జనాల ప్రాంతంలో విద్యుత్ శాఖ ఏర్పాట్లను పరిశీలించేందుకు క్యాంప్ కార్యాలయాలను ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రాంతాల వారీగా ఎస్‌పిడీసీఎల్ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్ల్లు అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్‌తో పాటు జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన నిమజ్జన కేంద్రాల వద్ద విద్యుత్‌శాఖ ప్రత్యేకంగా క్యాంప్‌లు ఏర్పాటు చేయనుంది. హుస్సేన్‌సాగర్ చుట్టూ సుమారు నాలుగు వరకు కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉంచనున్నట్లు వారు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News