Friday, January 10, 2025

వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి 

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి విఘాతల కలుగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్‌వికె శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ఆర్‌జి2 జిఎం కార్యాలయంలో గురువారం జిఎం మనోహర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గోన్న డైరెక్టర్ ఏరియాకు సంబందించిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాంట్రాక్టర్ ఓవర్‌బర్డెన్ తొలగింపు, వర్షాల వల్ల నీటి ప్రవాహం బయటకు పంపించే నాలాల ఏర్పాటు, వరద కాలువల పునరుద్దరణ, వర్షాల వల్ల బొగ్గు రవాణకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయడం, బొగ్గు నిలువ సామర్ధం, వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు సరైన సమయంలో అందజేయడం లాంటి అంశాలపై డైరెక్టర్ దిశానిర్ధేశం చేశారు. సమావేశంలో ప్రాజెక్టు అధికారి మధుసూధన్, ఏరియా ఇంజనీర్ నర్సింహరావ్, ప్రాజెక్టు ఇంజనీర్ దుర్గాప్రసాద్, సర్వే అధికారి నర్సింగరావ్, క్వాలిటీ వెంకటమోహన్, సెక్యూరిటి అధికారి పివి రమణ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News