Wednesday, January 22, 2025

అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే కరీంనగర్‌లో కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో మానేరు రివర్ ఫ్రంట్‌కి సరికొత్త శోభ సంతరించుకుంది. మరిన్ని సరి కొత్త సొబగులు అద్దాలని గురువారం హైదరాబాద్ నుండి మంత్రులు, అధికారుల బృందం సింగ పూర్, సీయోల్… ఒస్సొలో పర్యటన చేపట్టింది.

దాదాపు ఆరు రోజుల పాటు మానేర్ రివర్ ఫ్రంట్‌కు సరికొత్త సొబగులను అద్దాలనే పర్యటన కొనసాగుతుంది. తిరిగి బృందం జూలై 7న స్వదేశానికి చేరుకోనుంది. ఇప్పటికే కరీంనగర్‌కు కోట్లాది నిధులు వెచ్చించి నగర రూపురేఖలను మార్చివేసింది. అందులో భాగంగానే మానేరు నదిపై 224 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మించి ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు పొందింది.మానేరివర్ ఫ్రంట్ ను మొదటి దశలో 3.5 కిలోమీటర్లు గా…రెండవ దశలో 6.25 కిలోమీటర్లు గా మొత్తం 10 కిలోమీటర్లలో నిర్మిస్తున్నారు.

ప్రపంచంలోనే కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ను అధునాతనంగా తీర్చిదిద్దాలన్నదే ధ్యేయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మానేరు రివర్ ఫ్రంట్ కు అడ్డంకి కాకుండా ఆకర్షణీ యంగా ఉండాలని కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. కేబుల్ బ్రిడ్జితో మానేరు రివర్ ఫ్రంట్ కి సరికొత్త శోభ సంతరించుకుంది. పర్యాటకంలో కేబుల్ బ్రిడ్జ్ 20 శాతం అయితే మానేరు రివర్ ఫ్రంట్ 80 శాతం,ఎంఆర్‌ఎఫ్‌లో భాగంగా ఇప్పటికే బిగ్ ఓ ఫౌంటెన్ వర్క్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 410 కోట్లతో పనులు జరుగుతున్నాయి.

ఇందులో 310 కోట్లు మానేరు రివర్ ఫ్రంట్ కైతే మరో 100 కోట్లు పర్యాటకానికి కేటాయించడం జరిగింది. డ్యాం నుండి పెద్ద ఎత్తున వరద వస్తే తట్టుకునే విధంగా ఆఫ్ చెక్ డ్యాం… ఆఫ్ బరాజ్ నిర్మిస్తున్నారు. ఆగస్టులోగా మానేరు మొదటి దశ పనులను పూర్తి చేసి 12 అడుగుల లోతు ఉండేలా నీటిని నిలిపేయనున్నారు. 250 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్‌లో పర్యాటకంగా ఎలాంటి ధీములు చేపట్టాలనే దానిపై ఓ డెలిగేషన్ బృందాన్ని సిఎం కేసీఆర్ విదేశాలకు గురువారం పంపించారు.

ఈ డెలిగేషన్ బృందంలో ముగ్గురు రాజకీయ నాయకులు, ముగ్గురు అధికారులు ఉన్నారు. రాజకీయ నాయకుల్లో నాతోపాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధికార బృందంలో కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, రజత్ కుమార్, పర్యాటక శాఖ ఎండి మనోహర్ రావులు శుక్రవారం దక్షిణకోరియా విమానాశ్రమంలో విదేశీ వ్యవహారాల ఇంచార్జి స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News