Wednesday, January 22, 2025

పొదుపుతోనే సభ్యుల ప్రగతి సాధ్యం

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: చిన్న మొత్తాల పొదుపు సభ్యుల ప్రగతికి బాటలు వేస్తుందని మార్కండేయనగర్ లోని సత్యసాయి పరస్పర సహాయక సహకారం పొదుపు సంఘం అధ్యక్షుడు పగిడిమర్రి సూర్యనారాయణ అన్నారు. 20 మంది సభ్యులతో ఏర్పాటు అయిన సత్యసాయి పొదుపు సంఘం నేడు వందలాది మంది సభ్యులతో పురోభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ఆదివారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని మార్కండేయనగర్‌గల సత్యసాయి పొదుపు సంఘం ఆవరణలో ఆ సంఘం 23వ వార్షిక సర్వ సభ్య సమావేశం జరిగింది. ముందుగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో సాధించిన అభివృద్ధి, ఆదాయ, వ్య యాలు, సంఘ ఆస్తులు వివరాలను సభ్యులకు అధ్యక్షుడు సూ ర్యనారాయణ వివరించారు. వార్షిక నివేదికలను సభ్యులకు అందజేసి వారి సలహాలు, సూచనలతో పాటు సంఘ సేవలకు సంబంధించి పలు అంశాల పై చర్చించారు.

ఈ సందర్భంగా సత్యసాయి పొదుపు సంఘం అధ్యక్షుడు పగిడిమర్రి సూర్యనారాయణ మాట్లాడుతూ రూ.3.64 కోట్ల వార్షిక టర్నోవర్ సభ్యుల సహకారంతో 202223లో సాధించామన్నారు. రా నున్న ఆర్థిక సంవత్సరం దానిని రూ.5 కోట్లకు చేర్చడమే లక్షంగా పాలకవర్గంతో కలసి సంఘాభివృద్ధికి సభ్యుల సహకారంతో కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంఘం ద్వారా సభ్యుల పొదుపులను పరిగణలోకి తీసుకుని రూ.5 నుం చి రూ.10 లక్షల వరకు ప్రత్యేక రుణాలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. సభ్యులు మరణిస్తే మరణ ఉచిత సాయంగా రూ.15 వేలు అందజేస్తున్నామని, అప్పు పొంది మరణించిన వ్యక్తులకు మరణణ విపత్తు సాయంగా రూ.80 వేలు మాఫి చేయడం జరుగుతుందన్నారు. సభ్యత్వ విరమణ పొంది , సంఘంలో తమ పొదుపులు ఉంచిన సభ్యులకు పింఛన్‌లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

అందుకోసం ఫించన్ నిధి, సంఘ భీమా నిధిని మరింత ఆర్థిక పరిపుష్టికి తీసుకురావడానికి ఆడిటర్ వెంకటేష్, అకౌంటెంట్ శ్రీరామ్‌రాజు తో పాటు శ్రీబాలాజీ అసోసియేట్స్( చార్టెడ్ అకౌంట్స్) సేవలను వినియోగించడంతో పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి అంతర్గత ఆడిట్ చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకుడు గద్దె యాదగిరి, ముఖ్య సలహాదారులు ఏర్వ సత్యనారాయణ, గద్దె కృష్ణ, పగిడిమర్రి వాసు, ఉపాధ్యక్షుడు మునగపాటి విష్ణు, ప్రధాన కార్యదర్శి కోటశ్యామ్‌కుమార్, సహాయ కార్యదర్శి కర్నాటి శ్రీనివాస్, కోశాధికారి పిసికె భాస్కర్ , పాలకవర్గ సభ్యులు కంది అశోక్, కైరంకొండ శంకర్, విడెం రమేష్, శిరందాసు నరేందర్, కోట పవన్‌కుమార్, బి. విజయ్‌కుమార్ , గంజి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News