Wednesday, January 22, 2025

ముస్లిం సోదరుల అభ్యున్నతి కి కృషి

- Advertisement -
- Advertisement -

హుజూర్‌నగర్‌ః తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభ్యున్నతి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం బక్రీదు పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని పలు ఈద్గాల వద్ద ప్రర్ధనలలో పాల్గొని ముస్ల్లిం సోదరులకు ఎమ్మెల్యే ఆత్మీయాలింగనం చేసుకొని బక్రీదు శుభాకాంక్షలు తెలియజేశారు. హుజూర్‌నగర్ మండలం లోని వేపలసింగారంలో ఈద్గా వద్ద స్టేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖబరస్తాన్ ప్రహరీగోడ నిర్మాణానికి రూ. 5 లక్షలను మం జూరీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హుజూర్‌నగర్ ని యో జకవర్గంలోని ముస్ల్లిం సోదరుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి, ఎమ్‌పీటీసీ ముడెం గోపిరెడ్డి, పలువురు ముస్లీం లు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News