రైతుల ఆర్థిక ప్రగతికి అత్యంత అవసరం.. తెలంగాణలో ఫుడ్ స్టాప్ ఇన్నోవేషన్ సిస్టం ఏర్పాటు చేస్తాం
వరల్డ్ బిజినెస్ చికాగో సదస్సులో మంత్రి కెటిఆర్
కొనసాగుతున్న పెట్టుబడుల వేట
గ్లోబల్ కంపెనీ ఓ9 సొల్యూషన్స్‌కు స్వాగతం
మన తెలంగాణ/హైదరాబాద్:అత్యంత కీలకమైన ఆహార సంబంధిత రంగంలో చికాగో ఫుడ్‌స్టాప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం వంటి వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని ప రిశ్రమల మంత్రి కేటీఆర్ తెలిపారు.చికాగో ఫుడ్ స్టాప్ వంటిదే ఫుడ్ ప్రాసెసింగ్ పురోగతికి, తెలంగాణ ఆహార ఉత్పత్తులలో ఇన్నోవేషన్, ఆహార అలవాట్ల చరిత్రను భద్రపరచడం వంటి అంశాల కోసం తెలంగాణ ఫుడ్‌స్టాప్ ఏర్పాటుకు కృషి చేస్తామని కెటిఆర్ అన్నారు. వరల్డ్ బిజినెస్ చికాగో సంస్థ ఏర్పాటు సమావేశంలో మంత్రి కె టిఆర్ ప్రసంగించారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రా సెసింగ్ రంగంతో పాటు వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగా ల్లో చేపట్టిన కార్యక్రమాలను మంత్రి కెటిఆర్ వివరించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ ప్రాధాన్యత ఎంతగానో ఉన్నదని, ఇది కేవలం ఫుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా వ్యవసాయ రం గం పైన ఆధారపడిన రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లోని భాగస్వాముల అభివృద్ధికి సైతం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం వ్యవసాయ రంగానికి మాత్రమే మద్దతు ఇచ్చి ఊరుకోకుండా దాని అనుబంధ రంగమైన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందని కెటిఆర్ వివరించారు. అందులో భాగంగానే తెలంగాణ రా ష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. కోకాకోలా, పెప్సీకో, ఐటిసి వంటి దిగ్గజ సంస్థ లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. తె లంగాణ రాష్ట్రం ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధి కోసం పదివేల ఎకరాల వరకు కేటాయించి ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏ ర్పాటు చేస్తున్నదని ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ కార్యక్రమాలకు ప్రశంసలు
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తన పర్యటనలో భాగంగా అనేక పెట్టుబడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఈరోజు చికాగో నగరంలో చికాగో ఫుడ్ ప్రాసెసింగ్ ఈకో సిస్టం ను అధ్యయనం చేశారు. మంత్రి కెటిఆర్ చికాగో నగరంలోని చికాగో ఫుడ్ షాప్ ను సందర్శించి అక్కడ వరల్ బిజినెస్ షికాగో సంస్థ ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. చికాగో నగరానికి చెందిన పబ్లిక్‌అండ్ ప్రైవేట్ ఆర్థిక అభివృద్ధి ఏజెన్సీగా వరల్డ్ బిజినెస్‌గా చికాగో పనిచేస్తుంది. చికాగో ఫుడ్ షాప్ లో ఏర్పాటు చేసిన అనేక షాపులను ఆహార పద్ధతులు, వాటి చరిత్ర, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన వంటి అంశాలను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తూనే తమ ఆహార ఉత్పత్తులు ఆహారపు అలవాట్ల పైన ప్రత్యేకతలను జోడిస్తూ వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకు పంచుకుంటూ వారి నుంచి ఫీడ్బ్యాక్ అందుకునే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను చికాగో ఫుడ్ షాప్ కలిగి వుంది.
ఆహార ఉత్పత్తుల సరఫరాలో అగ్రస్థ్ధానం
చికాగో నగరం ఫుడ్ ఇన్నోవేషన్ సాంప్రదాయకంగా వచ్చిన ఆహారపు అలవాట్లు, ఆహారపు ఉత్పత్తుల సరఫరా వంటి అంశాలను కాపాడుకోవడంలో అగ్రస్థానంలో ఉన్నదని చికాగో ఫుడ్ షాప్ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌కు తెలిపారు. ప్రస్తుత ఆధునిక జీవితంలోనూ అత్యంత కీలకమైన ఆహారపు ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను వృద్ధిపరిచేందుకు తీసుకోవాల్సిన ఇన్నోవేషన్ ఈకో సిస్టం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వారు తెలిపారు. మంత్రి కేటీఆర్ చికాగో ఫుడ్ షాప్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక వ్యాపారవేత్తలతో సంభాషించారు. ముఖ్యంగా చికాగో అనుసరిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రోక్యుర్మెంట్ పద్ధతుల పైన ప్రత్యేకంగా చర్చించారు.
ఓ9 సొల్యూషన్స్‌కు మంత్రి కెటిఆర్ స్వాగతం
యుఎస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన మార్కెట్ లీడింగ్, వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సప్లై చైన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ o9 సొల్యూషన్స్, దాని గ్లోబల్ క్లయింట్‌ల కోసం ఆర్‌అండ్ డి, సేవల డెలివరీ సామర్థ్యాన్ని విస్తరించడానికి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించనుందని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. తద్వారా రాబోయే రెండేళ్లలో తెలం గాణలో 1000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. చికాగోలో దాని సహ వ్యవస్థా పకుడు, సిఇఒ, చక్రి గొట్టెముక్కల నేతృ త్వంలోని o9 నాయకత్వ బృందంతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పెట్టుబడి, ప్రమోషన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్ధన్‌రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే, సప్లై చైన్ స్కిల్స్ అకాడమీ @o9solutions సప్లయ్ చైన్ డొమైన్‌లో గ్లోబల్ కంపెనీల కోసం తమ స్థానిక ఇంజనీరింగ్ ప్రతిభకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంతో భాగ స్వామ్యంతో అభివృద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఓ9 సొల్యూషన్స్‌కు మంత్రి కెటిఆర్ స్వాగతం పలికారు. తెలంగాణకు ప్రత్య క్షంగా 1000 ఉద్యోగాలతో పాటు, టాస్క్(టిఎఎస్‌కె)తో అనుబంధంగా ఉన్న సప్లై చైన్ సిల్క్ అకాడమీ, తయారీ కార్యకలాపాలు విస్తరిస్తు న్నందున యువతకు మరిన్ని అవకాశాలు సృష్టించగలవన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు.