Monday, January 20, 2025

రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వైద్యరంగంలో పురోగతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వైద్య రంగంలో పురోగతి సాధ్యమైందని, మహబూబ్‌నగర్ లాంటి పట్టణాలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కళాశాల మనదేనని ఆయన అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక శిల్పారామంలో వైద్య ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మహబూబ్‌నగర్, తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతిపై ప్రదర్శించిన డాక్యుమెంటరీలను మ ంత్రి సహ మిగతా అతిథులు తిలకించారు. వైద్య ఆ రోగ్య శాఖకు చెందిన బ్రోచర్లను మంత్రి విడుదల చేశారు. మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు ముందే స్థలం సిద్ధ్దం చేసి కళాశాల సాధించినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మెడికల్ కళాశాల ఏర్పాటు తర్వాత ఒక్క ఎంబిబిఎస్ బ్యాచ్ పూర్తికాక ముందే పిజి సీట్లు సాధించిన మొదటి మెడికల్ కళాశాలమనదని అన్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అద్భుతమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అప్పుడు సింగిల్ డిజిట్‌లో వైద్యులు, సిబ్బంది ఉండేవారని, ఇప్పుడు వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని పెద్ద ఎత్తున నియమించామన్నారు. తెలంగాణకు ముం దు ముగ్గరు ఫార్మసిస్టులు ఉంటే ఇప్పుడు 38 మంది , నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు ఉంటే ఇప్పుడు 40 మంది, 30 మంది నర్సులు ఉంటే ఇప్పుడు 2 80 మంది, 30 మంది సిబ్బంది ఉంటే 250 మం దిని నియమించామన్నారు. తెలంగాణకు ముందు ఒక్క ఐసీయూ, ఆక్సీజన్ పడక కూడా ఉండేది కా దని ఇప్పుడు 100 ఐసియూ పడకలు, 500 ఆక్సిజన్ పడకలు, రెండు ఆక్సీజన్ ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు.

కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి రోగులు మహబూబ్‌నగర్ వ చ్చి వైద్య సేవలు పొందారని గుర్తు చేశారు. చావు బతుకులో ఉన్నవారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందించి బతికించిన ఘనత మనదన్నారు. ఆ రోగ్య శ్రీ కోసం రూ. 140 కోట్లు, సిఎంఆర్‌ఎఫ్ కో సం రూ. 23 కోట్లు ఖర్చు చేశామన్నారు. వచ్చే ఏ డాది లోపు 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించుకుంటామని తెలిపారు. కిడ్ని, గుండె, కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా ఇ క్కడే జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ , గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, ఎంపీపీ సుధాశ్రీ , జిల్లా వైద్యాధికారి డా. కృష్ణ, మెడికల్ కళాశాల డైరెక్టర్ డా. రమేష్ , జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాంకిషన్, డిప్యూటి సూపరింటెండెంట్ డా. జీవన్, వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్‌గౌడ్, డిప్యూ టీ డి.ఎంఅండ్ హెచ్‌ఓ డా. భాస్కర్ , నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి, వైద్యాధికారులు , డాక్టర్లు శశికాంత్ , రఫిక్ , ప్రగతి, మోతిలాల్, స్వప్న, రాధా, జీజీహెచ్ సభ్యులు సత్యం యాదవ్ , లక్ష్మి, మల్లేష్ , కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News