Sunday, December 22, 2024

అపోలో నుంచి అద్వానీ డిశ్చార్జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి కురువృద్ధ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ గురువారం సాయంత్రం ఇక్కడి అపోలో ఆసుపత్రి నుంచి దిశ్చార్జ్ అయ్యారని వర్గాలు తెలిపాయి. 96 ఏళ్ల అద్వానీ బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అపోలో ఆసుపత్రిలో చేరారు.

రాత్రి ఆసుపత్రిలోనే గడిపిన అద్వానీని గురువారం సాయంత్రం 5 గంటలకు దిశ్చార్జ్ చేసినట్లు వారు చెప్పారు. అంతకు ముందు ఆయన కొన్ని రోజులు ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని వారు తెలిపారు. అద్వానీ వెంట ఆయన కుమార్తె ప్రతిభ అద్వానీ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News