మనతెలంగాణ/ హైదరాబాద్ : విలువైన వృక్షాల సంరక్షణకు అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రానిక్ చిప్ సెన్సర్ దోహదం చేస్తుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ అన్నారు. మంగళవారం బోటానికల్ గార్డెన్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సిబిఐఓటి. టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన ‘రియల్ టైం మానిటరింగ్ ఐఓటి ఎలక్ట్రానిక్ చిప్ సెన్సర్‘ పరికరం డెమో నిర్వహించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం లాంటి విలువైన వృక్షాలను సంరక్షించేకునేందుకు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తుందన్నారు. సమావేశంలో ఎఫ్‌సిఆర్‌ఐ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కంటోన్మెంట్ బోర్డు, హెచ్‌ఎండిఎ, హెచ్‌సియు, ఎన్‌జిఆర్‌ఐ, బయోడైవర్సిటీ బోర్డు, టిఎస్ పిఎ, జిహెచ్‌ఎంసి, ఓయు నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ డా. జి. స్కైలాబ్ తదితరులు ఉన్నారు.