- Advertisement -
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు నమోదు చేసిన పీడీయాక్టును పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు బుధవారం సమర్థించింది. పిడియాక్ట్ కేసు కొట్టివేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరిస్కరించింది. దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్ కు షాక్ తగిలింది. విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ తనపై పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను రాజా సింగ్ అడ్వైజరీ కమిటీలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్ పిటిషన్ పై అడ్వైజరీ కమిటీ బుధవారం విచారణ చేపట్టింది. ఓ మతాన్ని కించపరిచేలా రాజాసింగ్ వీడియో విడుదల చేశారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేసిన ముచ్చట తెలిసిందే.
- Advertisement -