Sunday, April 27, 2025

నాంపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కుటుంబ కలహాలకు తాళలేక ఓ జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…అంబర్‌పేలో కుటుంబంతోపాటు ఉంటున్న మణికంఠ నాంపల్లిలోని జెఎఫ్‌సిఎం ఎక్సైజ్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నాడు. జడ్జికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇటీవల కాలంలో కుటుంబంలో తరచూ గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే జీవితంపై మనస్థాపం చెందిన మణికంఠ చున్నీతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్‌పేట పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News