Monday, December 23, 2024

ఎదురు ఇంట్లోకి చొరబడి.. ఇద్దర్ని చావబాదిన అడ్వకేట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన ఇంటి ముందు చెత్త వేస్తున్నారని ఓ మహిళ, మరో వ్యక్తిపై హైకోర్టు న్యాయవాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా మలక్‌పేటలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయవాది ఆంథోని రెడ్డి, అలియాస్ క్రాంతి రెడ్డి, మూసారాంబాగ్‌లోని సాయి నగర్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. వీడియోలో అతను తన ఇంటి ముందు వ్యర్థాలను పడవేసాడని ఒక వ్యక్తిని ఫ్లాట్ నుండి దాడి చేయడం చూడోచ్చు.

మహిళను ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లి శారీరకంగా దాడి చేశాడు. అతను జోక్యం చేసుకున్న వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. న్యాయవాది తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడని బాధితులు తెలిపారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాయర్ దాడిలో గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News