- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ మాతృశ్రీ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాన్ కి ఉరివేసుకుని అడ్వకేట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని అనుముల జయశంకర్ రెడ్డిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్ఠం నిమిత్తం మార్చురీకి తరలించారు. భార్య భర్తల మధ్య గొడవల కారణంగా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
- Advertisement -