Monday, December 23, 2024

చంద్రబాబును కలిసిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును రాజమహేంద్రవరం జైలులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం కలిశారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున లూథ్రా న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో ములాఖత్ అయిన లూథ్రా కోర్టులో బుధవారం జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణను వివరించినట్టు తెలిసింది. ములాఖత్ తర్వాత లూథ్రా.. చంద్రబాబు కుటుంబ సభ్యులు, టిడిపి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబుతో సమావేశమైన వివరాలతో పాటు న్యాయ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News