Wednesday, January 8, 2025

రూ.200 కోట్ల అక్రమాస్తులు.. చంచల్‌గూడ జైలుకు ఏఈఈ నిఖేష్ కుమార్‌

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ పంజా విసురుతోంది. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‌ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఏసీబీ జడ్జీ ముందు హాజరు పర్చగా.. డిసెంబర్ 13వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

కాగా, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు శనివారం నిఖేష్ కుమార్‌, అతని బంధువులు, స్నేహితుల నివాసాల్లో సోదాల్లో జరిపారు. దీంతో దాదాపు రూ. 200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించిన అధికారులు.. వాటికి సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకు నిఖేష్ ను అరెస్టు చేశారు. గతంలోనూ లంచం తీసుకుంటూ నిఖేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News