Monday, January 20, 2025

ఏరోనిక్ కంపెనీ ఎండి, సిఇఒల హత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : బెంగళూరులో ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోలను కంపెనీ మాజీ ఉద్యోగి హత్య చేశాడు. ఈ కంపెనీని ఏడాది క్రితం స్థాపించారు. నిందితుడు నేరుగా ఆఫీస్ లోకి దూసుకెళ్లి కత్తితో వారిపై దాడికి పాల్పడ్డాడని ఎండీ, ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో వినుకుమార్ ప్రాణాలు కోల్పోయారని పోలీస్‌లు చెప్పారు. నిందితుడు ఫెలిక్స్ పరారీలో ఉన్నాడని బెంగళూరు నార్త్ ఈస్ట్ డీసీపీ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. ఫెలిక్స్‌కు కూడా ఇదే తరహా వ్యాపారం ఉందని సమాచారం. ఫణీంద్ర, వినుకుమార్‌లు తన వ్యాపారంలో జోక్యం చేసుకుంటున్నారని నిందితుడు చెబుతున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News