Monday, December 23, 2024

బ్రెజిల్‌లో కుప్పకూలిన విమానం: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మనౌస్: బ్రెజిల్‌లోని అమెజోనస్ రాష్ట్రంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. అమెజాన్ రాష్ట్ర రాజధానికి 400 కిలో మీటర్ల దూరంలో బర్సిలోస్ ప్రాంతంలో విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారని ఆ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై విచారణ చేస్తున్నామని మానౌస్ ఎరోటాక్సీ ఎయిర్‌లైన్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News