- Advertisement -
న్యూయార్క్: చిన్న విమానం విద్యుత్ టవర్‌ను ఢీకొట్టి అనంతరం తీగల్లో చిక్కుకున్న సంఘటన అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం మాంట్‌గోమరీ కౌంటీలో జరిగింది. భూమి నుంచి 30 మీటర్ల ఎత్తులో విమానం ఉండిపోయింది. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఒక ఇంజిన్ కలిగిన విమానం న్యూయార్క్ నుంచి బయల్దేరింది. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్ర 5.40 నిమిషాలకు విద్యుత్ టవర్‌ను చిన్నపాటి విమానం ఢీకొట్టిన అనంతరం తీగల్లో చిక్కుకుంది. విమానం ప్రమాదం జరిగినప్పుడు అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 12.36 నిమిషాలకు మొదటి వ్యక్తిని రక్షించారు. మరో 11 నిమిషాల తరువాత రెండో వ్యక్తిని బయటకు తీశారు. వారు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -