Friday, December 20, 2024

కుప్పకూలిన దుండిగల్ ఎయిర్ ఫోర్స్ విమానం: ఇద్దరు మృతి…(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం పరిధి రావెల్లి శివారులో సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయింది. శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి శిక్షణ విమానం పూర్తిగా కాలిపోయింది.  ఒకరు పైలెట్, మరొకరు ట్రైనీ పైలెట్ గా గుర్తించారు. మృతదేహాలు  గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. ఘటనా స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మృతదేహాల్ని అంబులెన్స్ లో హైదరాబాద్ తరలించేందుకు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News