ప్రతి బిడ్డకు కంప్యూటర్ సైన్స్ అందుబాటులోకి తేవడంపై దృష్టి
హైదరాబాద్ : ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ అనే ఎడ్ టెక్ సంస్థ అమెజాన్, గిరిజన సంక్షేమ శాఖల మద్దతుతో తెలంగాణలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఎఎఫ్‌ఇ) ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. ఎఎఫ్‌ఇ కార్యక్రమం 1.2 మిలియన్లకు పైగా విద్యార్థులను కోడింగ్ నేర్చుకునేలా చేయడంలో గణనీయమైన విజయాన్ని సాధించింది. వారి రోజువారీ బోధనా విధానాలలో గణన ఆలోచనా ( కంప్యూటేషన్ థింకింగ్) పద్ధతులను ఏకీకృతం చేయడంలో భారతదేశం అంతటా 9 వేలకు పైగా ఉపాధ్యాయులకు మద్దతుగా నిలుస్తోంది.
ఎఎఫ్‌ఇ ప్రోగ్రామ్‌లో విజేతగా నిలిచిన అసాధారణ నాయకులను గుర్తించడానికి, అమెజాన్ ప్రపంచంలోనే తమ అతిపెద్ద క్యాంపస్‌లో ఎఎఫ్‌ఇ కార్నివాల్ అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్నివాల్‌లో రోబోటిక్స్ గది, అమెజాన్ బృందంతో చర్చలు, ఎడబ్లుస్ డీప్ రేసర్ ఛాలెంజ్‌లు, స్వయంగా అలెక్సాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశంతో సహా ఆకర్షణీయమైన ఎన్నో అనుభవాలను అందించింది.
ఈవెంట్‌లో పాల్గొనే వారందరికీ ఫైర్‌సైడ్ చాట్‌లు, ఉత్తేజపరిచే క్విజ్‌లు, ఉత్తేజకరమైన బహుమతులు అందిస్తోంది. ముఖ్యంగా, టిటిడబ్లుర్‌జెసి (తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల) జంగమ్మెట్ నుండి 34 మంది బాలికలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ నాయకుడు అక్షయ్ మాట్లాడుతూ, భారతదేశంలోని ప్రతి బిడ్డకు కంప్యూటర్ సైన్స్ అభ్యాసాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే అమెజాన్ దృష్టి సారించిందని స్పష్టం చేశారు. పాఠ్యాంశాల్లో కంప్యూటర్ సైన్స్ ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఎఎఫ్‌ఇ ప్రోగ్రామ్ ఉపాధ్యాయ శిక్షణ, కోడింగ్ బూట్ క్యాంప్‌లను ఎలా నిర్వహిస్తుందో, యాప్‌లు, రోబో టిక్‌లతో సహా వివిధ సాంకేతిక జోక్యాలతో విద్యార్థులు ప్రయోగాత్మకంగా అనుభవాన్ని పొందేలా చేయడం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు.
కంప్యూటర్ సైన్స్ వ్యవస్థలోని లింగ అసమానతలను గుర్తిస్తూ, ఎఎఫ్‌ఇ తన ప్రయత్నాలను తరగతి గదులకు మించి విస్తరించింది. 11 రాష్ట్రాల్లోని 7 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 1.2 మిలియన్ల మంది పిల్లలకు చేరువైంది. ఎక్కువ మంది మహిళలు కంప్యూటర్ సైన్స్‌లో కెరీర్‌లను అన్వేషించడానికి, కొనసాగించడానికి మార్గాలను సృష్టించే ప్రయత్నంలో ఎఎఫ్‌ఇ మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ స్కాలర్‌షిప్‌లను కూడా ప్రారంభించింది. వెనుకబడిన నేపథ్యాల నుండి ప్రతిభావంతులైన 200 మహిళలకు స్కాలర్‌షిప్‌లు అందించబడ్డాయి. ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ , అమెజాన్‌తో భాగస్వామ్యానికి, తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని 50 పాఠశాలల్లో ఎఎఫ్‌ఇ ప్రోగ్రామ్‌ను అమలు చేయడం చాలా గర్వంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సహకారం ద్వారా 14 వేల కంటే ఎక్కువ మంది బాలికలు కంప్యూటర్ సైన్స్ అద్భుతాలను తెలుసుకున్నారు. ఈ రంగంలో వారి భవిష్యత్తు, ఆకాంక్షలను రూపొందించడానికి వీలు కల్పించారు. అదనంగా, ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ విద్యార్థులు వారి స్వంత అవగాహనతో నేర్చుకోవడంలో సహాయపడటానికి AI -ఆధారిత వ్యక్తిగతీకరించిన అడాప్టివ్ లెర్నింగ్ టూల్ అయిన మైన్డ్ స్పార్క్ ను కూడా అందిస్తోంది.