డెహ్రాడూన్: అడవుల పెంపు కోసం కేటాయించిన నిధులను ఉత్తరాఖండ్ అటవీ శాఖ అధికారులు దారి మళ్లించారు. ఈ నిధులతో వారు ఐఫోన్లు, లాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, కూలర్ల కొనుగోలు చేయడమే కాకుండా.. భవనాల రీపేర్లు ఇతర పనులకు కూడా వాడేసుకున్నారు. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికలో బయటపడింది. 2019 నుంచి 2022 వరకూ దాదాపు రూ.13.86 కోట్లను అడవుల పెంపు కోసం కేటాయించగా.. వాటిని అధికారులు దుర్వినియోగం చేశారు.
అంతేకాక.. డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఆర్ఐ) విధించిన 60-65శాతం అడవుల పెంపు నిబంధనను కూడా ఉల్లంఘించి.. కేవలం 33.51 శాతానికి అడవుల పెంపును తగ్గించారని తెలుస్తోంది. దీనిపై స్పందించిన రాష్ట్ర అటవీశాఖ మంత్రి సుబోధ్ ఉనియల్ ‘నిధుల మళ్లింపుపై కాగ్ ఇచ్చిన నివేదికను మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. దీనిపై వెంటనే విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ కార్యదర్శిని ఆదేశించాము.