కాబుల్: వచ్చే నెలలో శ్రీలంక వేదికగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడింది. ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సిరీస్‌ను వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి అఫ్గాన్ క్రికెట్ బోర్డు వచ్చింది. ఈ విషయాన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 3 నుంచి అఫ్గాన్‌పాకిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అఫ్గాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సిరీస్‌ను వాయిదా వేశారు. దేశంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో క్రికెటర్ల మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని, ఇలాంటి స్థితిలో క్రికెట్ సిరీస్‌ను కొనసాగించడంలో అర్థం లేదని అఫ్గాన్ క్రికెట్ బోర్డు పెద్దలు పేర్కొన్నారు. ఇదిలావుండగా అఫ్గాన్‌తో సిరీస్ వాయిదా పడడంతో పాకిస్థాన్ క్రికెటర్లు నిరాశకు గురయ్యారు. రానున్న ట్వంటీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ సిరీస్‌పై పాక్ ఆటగాళ్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే సిరీస్ వాయిదా పడడంతో వారిలో నిరాశ నెలకొంది.
AFG vs PAK ODI Series Postponed