Sunday, December 22, 2024

భారత్‌లోని ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ మూసివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ఆఫ్ఘ్ఘనిసాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత ప్రభుత్వంనుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో న్యూఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం( అక్టోబర్ 1)నుంచి మూసివేయనున్నామని ఫ్ఘ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపట్ల ఎంతో చింతిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రకటనవిడుదల చేసింది.భారత్, అష్ఘానిస్థాన్ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాఅను, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత తమ దౌత్య కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించామని వెల్లడించింది. న్యూఢిల్లీలోని ఆష్ఘన్ దౌత్య కార్యాలయానికి దౌత్యవేత్తగా ఫరీద్ మముంద్‌జాయ్ నాయకత్వం వహిస్తున్నారు.అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఆయనను నియమించింది.

2021 ఆగస్టులో తాలిబన్ దళాలు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆయన తన పదవిలో కొనసాగారు. ‘ దౌత్యపరమైన మద్దతు లేకపోవడం, కాబూల్‌లో చట్టబద్ధంగా పని చేసే ప్రభుత్వం లేకపోవడం వల్ల ఆఫ్ఘనిస్థాన్ పౌరులకు సరైన ప్రయోజనాలను అందించడంలో మా లోపాలను అంగీకరిస్తున్నాం. ఎంబసీ ఊహించని పరిస్థితుల కారణంగా దౌత్య కార్యాలయ సిబ్బంది, వనరుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల కార్యకలాపాలు కొనసాగించడం కష్టతరంగా మారింది.దౌత్యవేత్తలకు, ఇతర సహకార రంగాలకు సకాలంలో వీసా పునరుద్ధరణ,తగినంత మద్దతు లేకపోవడం మా బృందంలో నిరాశకు దారి తీసింది. సాధారణ విధులను సమర్థవంతంగా నిర్వహించే మా సామర్థానికిఆటంకం కలిగింది.

ఈ నిర్ణయం కారణంగా కొంతమంది వ్యక్తులు కాబూల్‌లోని తాలిబన్ పాలననుంచి మద్దతు, సూచనలు అందుకోవచ్చు. ఇది ఎంబసీ ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉండవచ్చు’ అని రాయబార కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కాగా ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని,ఏ దేశానికి కూడా వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకాలాపాలకు ఆఫ్ఘన్ నేలను ఉపయోగించకుండా నిరోధించాలని మన దేశం డిమాండ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News