Friday, November 22, 2024

20 ఏళ్ల సవ్యమైన దశను కోల్పోలేం

- Advertisement -
- Advertisement -

Afghan President Ashraf Ghani reassures people

భద్రతా బలగాల బలోపేతం కీలకం
ప్రజలకు అఫ్ఘన్ నేత అష్రఫ్ భరోసా
సంప్రదింపులతో పరిష్కారానికి కృషి

కాబూల్:  దేశం ఇప్పుడు తీవ్రస్థాయి అస్థిరతతో కొట్టుమిట్టాడుతోందని అఫ్ఘనిస్థాన్ అధ్యక్షులు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా సాధించుకున్న విజయాలను దేశం కోల్పోదల్చుకోలేదని తెలిపారు. తాలిబన్లు పలు వైపుల నుంచి ఆక్రమణలు, ఆధిపత్య ధోరణులతో కాబూల్ వైపు దూసుకువస్తున్న దశలో ఘనీ తొలిసారిగా దేశ ప్రజలను ఉద్ధేశించి టీవీలలో ప్రసంగించారు. ఇప్పుడు ప్రమాదం నెలకొని ఉందని, అయితే దీని నుంచి దేశాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కెందుకు అంతర్జాతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఒక్కరోజు క్రితం ఘనీ దేశ భద్రతా పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఆయన రాజీనామాకు సిద్ధం అయినట్లు వార్తలు వెలువడ్డాయి.

తాలిబన్లకు అధికారం అప్పగిస్తారనే ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. అయితే వీటిని తిప్పికొట్టే రీతిలో ఆయన ప్రజలకు భరోసా కల్పించేందుకు యత్నించారు. దేశాధ్యక్షులుగా తాను ప్రజలకు భద్రతా విషయాలపై తగు భరోసా ఇస్తున్నానని, అస్థిరత్వ నివారణకు అన్ని విధాలుగా దృష్టి సారించినట్లు తెలిపారు. 20 ఏళ్లుగా సాధించిన విజయాలు ఉన్నాయి. ఎదురుదెబ్బలు ఉన్నాయి. విజయాల ఫలాలు ప్రజలకు ఇక ముందు కూడా అందాల్సి ఉంటుంది. ఈ దిశలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశ భ ద్రతా బలగాలను తిరిగి సమాయత్తం చేయడం కీలకమైన విషయం అని, ఈ దిశలో స్థానిక రాజకీయ నేతలు, ప్రపంచదేశాల ప్రతినిధులతో విస్తృత సంప్రదింపులు చేపట్టినట్లు తెలిపారు.

దేశం అరాచకంతో వెనకబడిపోవడం అంగీకరించేది లేదని , తిరిగి అస్థిరత్వం కుదరదు. హింసాకాండ, ప్రజల నిర్వాసిత పరిస్థి తిరిగి నెలకొనరాదని, ఇందుకు శాయాశక్తుల యత్నిస్తామని, దీనికి అత్యంత ప్రాధాన్య అంశంగా దేశంలో భద్రతా బలగాల పునః పటిష్టత వాటి పున సమీకరణ నిర్థారించుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. అఫ్ఘన్లు యుద్ధంలో బలి కావడం, వారి ఆస్తులు ధ్వంసం కావడం, ఇంతకాలం సాధించుకున్న అభివృద్ధి వారికి దక్కకుండా పోవడం వంటివాటిని తాను అంగీకరించేది లేదన్నారు. తన రాజీనామా వార్తల గురించి ఘనీ ఏ విధమైన ప్రస్తావన చేయలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News