Tuesday, January 21, 2025

అఫ్ఘాన్ సంచలనం

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్ క్రికెట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై గెలుపు

ఇంగ్లండ్‌పై 69 పరుగులతో భారీ విజయం

న్యూఢిల్లీ : వన్డే వరల్డ్ కప్‌లో అఫ్ఘానిస్థాన్ సంచలన విజయం సాధించింది. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించి, మొదటి గెలుపును నమోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమతూకంగా రాణించి ఇంగ్లండ్‌కు కళ్లె వేసింది. అఫ్ఘాన్ బౌలర్ల ధాటికి డెవిడ్ మలాన్(32), హ్యారీ బ్రూక్(66) తప్ప మరెవరూ రాణించలేక పోయారు. దాంతో 40.3ఓవర్లలో 215 పరుగులు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అంత కుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన అఫ్ఘాన్ బ్యాటర్లలో రహ్మతుల్లా గుర్బాజ్ 80(57 బంతుల్లో 8×4 4×6), ఇక్రమ్ అలీ ఖిల్ 58(66 బంతుల్లో 3×4 2×6), ఇబ్రహీం జాద్రాన్(28), రషీద్ ఖాన్(23), ముజీబ్ ఉర్ రహ్మన్(28)లు బ్యాట్ ఝలిపించడంతో నిర్ణీత 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా మొహమ్మద్ నబీ 2, నవీన్ ఉల్ హాక్- , ఫజల్ హక్ ఫారూఖీ- తలో వికెట్ పడగొట్టి ఆఫ్ఘాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇంగ్లండ్ ఐదోసారి ఓటమి..
వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు ఐదోసారి ఓటమి పాలైంది. అంతకుముందు 1992లో జింబాబ్వే చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2011లో ఐర్లాండ్‌తో 3 వికెట్ల తేడాతో, బంగ్లాదేశ్‌తో 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2015లో కూడా బంగ్లాదేశ్ జట్టుపై 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక తాజాగా 2023లో ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో ఓడించి అఫ్ఘానిస్థాన్ దోసారి ప్రపంచకప్‌లో భారీ షాక్ ఇచ్చింది. అంతే కాదు టి-20 ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్‌తో రెండుసార్లు ఓడి ఇంగ్లండ్ జట్టు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News