Monday, December 23, 2024

గురుద్వారాపై ఉగ్రదాడులు.. భారత్‌కు తరలివస్తున్న అఫ్గాన్ సిక్కులు

- Advertisement -
- Advertisement -

Afghan Sikhs arrive in India

న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్‌లో గురుద్వారాపై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ప్రాణ రక్షణ కోసం అక్కడి సిక్కులు భారత్‌కు తరలివస్తున్నారు. ఈమేరకు మొదటి బృందంలో 11 మంది గురువారం ఢిల్లీ చేరుకోబోతున్నారు. అఫ్గాన్ లోని కాబూల్‌లో గురుద్వారాపై 2020 మార్చిలో ఉగ్రవాద దాడి జరగ్గా, వందలాది మంది హిందూ సిక్కులను భారత్‌కు తీసుకొచ్చేశారు. అయితే ఇంకా 150 మంది అక్కడే ఉండిపోయారు. జూన్ 18న గురుద్వారాపై మళ్లీ ఉగ్రదాడి జరిగిన తరువాత భారత ప్రభుత్వం 111 మందికి వీసాలు జారీ చేసింది. వీరిని ఢిల్లీకి తీసుకొస్తున్నారు. మరికొందరి వీసాల జారీ పెండింగ్‌లోఉంది. జూన్ 18న దాడిలో గాయపడిన రక్‌బీర్ సింగ్ కూడా గురువారం న్యూఢిల్లీ చేరుకునే 11 మందిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News