Thursday, January 23, 2025

అఫ్గానిస్థాన్‌పై బంగ్లాదేశ్ పైచేయి

- Advertisement -
- Advertisement -

ఢాకా: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. గురువారం రెండో రోజు బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. 362/5 ఓవర్‌నైట్ స్కోరుతో తిరిగి మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ 382 పరుగులకే ఆలౌటైంది. నిజాత్ మసూద్ ఐదు వికెట్లు తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. నజ్ముల్ (146) అద్భుత సెంచరీ సాధించాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన అఫ్గానిస్థాన్ 39 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.

నసీర్ జమాల్ (35), జజాయ్ (36), కరీం జన్నత్ (23), అబ్దుల్ మాలిక్ (17) మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. బంగ్లా బౌలర్లలో ఇబాదత్ హుస్సేన్, నలుగు, షరిఫుల్ ఇస్లామ్, మెహదీ హసన్, తైజుల్ ఇస్లాం రెండేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బంగ్లాదేశ్ గురువారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ఆధిక్యం 370 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News