Monday, December 23, 2024

గెలుపు బాటలో బంగ్లాదేశ్

- Advertisement -
- Advertisement -

ఢాకా: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ గెలుపు బాటలో ప్రయాణిస్తోంది. 707 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన అఫ్గానిస్థాన్ శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే అఫ్గానిస్థాన్ మరో 617 పరుగులు చేయాలి. ఓపెనర్లు ఇబ్రహీం జర్దాన్(0), అబ్దుల్ మాలిక్(5) ఇప్పటికే పెవిలియన్ చేరారు. రహ్మత్ షా(10), నసీర్ జమాల్ (5) క్రీజులో ఉన్నారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (13) రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

అంతకుముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 425 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. నజ్ముల్ హుస్సేన్ షాంటానో రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో అలరించాడు. నజ్ముల్ 15 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. ఇక మోమినుల్ హక్ 121 (నాటౌట్) కూడా సెంచరీ సాధించాడు. కెప్టెన్ లిటన్ దాస్ అజేయంగా 66 పరుగులు చేశాడు. దీంతో బంగ్లా భారీ స్కోరును నమోదు చేసింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 382 పరుగులు చేయగా, అఫ్గానిస్థాన్ 146 పరుగులకే కుప్పకూలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News