Tuesday, January 21, 2025

సెమీస్ రేసులో అఫ్గాన్

- Advertisement -
- Advertisement -

పుణె : వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ మరో సంచలనం సృష్టించింది. శ్రీలంకపై 7 వికెట్లతో విజయం సాధించి సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి లంకను ఓడించింది. అటు ఫజల్ ఫారు ఖీ(4/34), ముజీబ్ రెహ్మన్(2/38)లు బౌలింగ్‌తో లంకను తక్కువ స్కోరు కే పరిమితం చేయగా.. బ్యాటింగ్‌లో హస్మత్ షాహీది (58), రహ్మత్ షా(62), అజ్మత్ ఓమర్‌జాయ్(73), ఇబ్రహీం జాద్రన్(38)లు బ్యాట్ ఝలిపించడంతో కేవలం 45.2 ఓవర్లలోనే లంక నిర్దేశించిన లక్షాన్ని చేరుకొని విజయ దుందుభి మోగించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక..

49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (46; 60 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నె (15) పరుగులకే వెనుదిరిగాడు. కుశాల్ మెండిస్ (39; 50 బంతుల్లో 3×4), సదీర సమరవిక్రమార్క (36; 40 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించారు. ఎంజొలో మాథ్యూస్ (23; 26 బం తుల్లో 1×4, 1×6), చరిత్ అసలంక (22), ధనంజయ డిసి ల్వా (14) తక్కు వ స్కోరుకే పెవిలియన్ చేరారు. టెయిలెండర్ మహీశ్ తీ క్షణ (29; 31 బంతుల్లో 3×4, 1x 6) రాణించడంతో లంక స్కోరు ఆమాత్రం చేయగలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News