Thursday, January 23, 2025

ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ పై నిషేధం..

- Advertisement -
- Advertisement -

ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ పై ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్ టి20) నిషేధం విధించింది. ఐఎల్ టి20 టోర్నమెంట్ సీజన్ 1 కోసం షార్జా వారియర్స్‌తో కుదుర్చుకున్న తన ప్లేయర్ ఒప్పందాన్ని నవీన్ ఉల్లంఘించినందుకు.. అతనిపై 20 నెలలు నిషేధం విధించింది. ఈ ఏడాది మొదట్లో ఐఎల్ టి20 సీజన్ 1 జరిగింది. ఈ టోర్మెంట్ లో పెద్ద నవీన్ రాణించలేదు. తొమ్మిది మ్యాచ్ లో కేవలం 11 వికెట్లు మాత్రమే తీశాడు.

ఐపిఎల్ 2023లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో నవీన్-ఉల్-హక్ గొడవపడి వార్తల్లో నిలిచి విషయం తెలిసిందే. లక్నో సూపర్ జాయింట్స్ తరుఫున ఆడుతున్న నవీన్-ఉల్-హక్… లక్నో వర్సెస్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో గొడవపడ్డాడు. ఇది కాస్త.. లక్నో మెంటర్ గా ఉన్న గంభీర్ వర్సెస్ కోహ్లీగా మారింది. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద దూమారమే రేపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News