Tuesday, November 5, 2024

తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘాన్ ప్రభుత్వం..

- Advertisement -
- Advertisement -

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. పలు రాష్ట్రాలతోపాటు దేశ రాజధాని కాబూల్ ను పూర్తిగా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆఫ్ఘానిస్తాన్ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. అనంతరం తాలిబన్లకు అధికారం అప్పగిస్తున్నట్లు ఆఫ్ఘాన్ సర్కార్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే దేశ ప్రధాన నగరాలతోపాటు ఆదివారం ఉదయం రాజధాని కాబూల్ ను కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘాన్ స్పీకర్, మంత్రులు పాకిస్తాన్ కు పారిపోయారు. దేశంలోని అన్ని దారులను తాలిబన్లు బ్లాక్ చేయడంతో ఉధృిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుద్ధానికి ముందే ఆఫ్ఘాన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆఫ్ఘాన్ పౌరులకు హాని తలపెట్టమని తాలిబన్లు ప్రకటించారు. దేశ కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ కు చెందిన ముల్లా బరాదార్ ను నియమించనున్నట్లు సమాచారం.మరోవైపు తాలిబన్ల దురాక్రమణపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బలప్రయోగం అంతర్యుద్ధానికి దారితీస్తుందని పేర్కొంది. ఈ ఘటనతో ఆఫ్ఘాన్ లో ఉన్న సుమారు 1500 మంది భారత పౌరులను తిరిగి ఇండియాకు రావాలని విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. అఫ్ఘాన్ నుంచి హెలికాప్టర్ల ద్వారా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా తరలిస్తోంది.

Afghanistan Govt Surrender to Taliban

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News