Friday, December 20, 2024

వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన అఫ్గానిస్థాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ లో ఆఫ్గానిస్థాన్ మరో సంచలనం సృష్టించింది. పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌పై తొలిసారిగా విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ రికార్డు నెలకొల్పింది. ఎనిమిది వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను అఫ్గానిస్థాన్ మట్టికరిపించింది. చెన్నైలో జరుగుతున్న 2023 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇప్పటికే ఇంగ్లాండ్ ను ఓటించి అఫ్గానిస్థాన్ మంచి ఫామ్ లోఉంది. పాక్ పై విజయంతో పాయింట్ల పట్టికల్లో అప్థానిస్థాన్ 6వ స్థానానికి చేరింది. నేడు ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్- దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ముంబయి వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

స్కోర్లు: పాకిస్థాన్ 282/7, అఫ్గానిస్థాన్ 286/2 గా ఉన్నాయి.

అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ : ఇబ్రహీం జడ్రాన్ 87, రెహ్మనుల్లా గుర్బాజ్ 65, రహమత్ షా 77 నాటౌట్, హష్మతుల్లా షాహిది 48 నాటౌట్ గా నిలిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News