కాబూల్: భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్‌ను ఎంపిక చేశారు. అఫ్గాన్ జాతీయ సెలక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. భారత్‌లో పర్యటించే అఫ్గాన్ టీమ్ మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. జనవరి 11 నుంచి 17 వరకు సిరీస్ జరుగనుంది. తొలి టి20 11న మొహాలీలో, రెండో మ్యాచ్ 14న ఇండోర్‌లో, చివరి టి20 జనవరి 17న బెంగళూరులో జరుగుతుంది.
కాగా, భారత్‌తో జరిగే సిరీస్ కోసం 19 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. జద్రాన్‌తో పాటు గుర్బాజ్, ఇక్రమ్ అలీ, హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జన్నత్, అజమౌల్లా ఒజర్జాయ్, షర్ఫోద్దీన్ అష్రఫ్, ముజీబుర్ రహ్మాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సలీం, నూర్ అహ్మద్, నవీనుల్ హక్, ఫజల్ హక్ ఫరూఖి, ఫరీద్ అహ్మద్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నైబ్.