Monday, December 23, 2024

ఆసియా టోర్నీకి అఫ్గాన్ జట్టు ఎంపిక..

- Advertisement -
- Advertisement -

కాబూల్: ఆసియాకప్ వన్డే టోర్నమెంట్‌లో పాల్గొనే అఫ్గానిస్థాన్ జట్టును ఆదివారం ప్రకటించారు. ఆరు దేశాలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం 17 మందితో కూడిన అఫ్గాన్ టీమ్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. హష్మతుల్లా షాహిదీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. టి20లలో నిలకడగా రాణిస్తున్న ఆల్‌రౌండర్ కరీం జన్నత్‌కు ఆరేళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు లభించింది. ఆసియాకప్‌నకు ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక, పాకిస్థాన్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో నలుగురు స్పిన్నర్లకు అఫ్గాన్ జట్టులో చోటు కల్పించారు. అఫ్గాన్ ఆసియాకప్‌లో మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 3న బంగ్లేదేశ్‌తో ఆడనుంది.

జట్టు వివరాలు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జర్దాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ, కరీం జన్నత్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, ముజీబుర్ రహ్మాన్, మహ్మద్ సలీమ్, ఫజల్ హక్ ఫారూఖి, నూర్ అహ్మద్, అబ్దుల్ రహ్మాన్, షర్ఫోద్దీన్ అష్రఫ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News